Tapsi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • క్రికెటర్ మిథాలీ రాజ్ పాత్రలో తాప్సీ 
  • రీమేక్ లో నటించనున్న 'దొరసాని' హీరో
  • బాలకృష్ణ, బోయపాటి సినిమా అప్ డేట్ 

  *  ప్రముఖ నటి తాప్సీ ఇప్పుడు ఓ బయోపిక్ లో నటించనుంది. ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా హిందీలో రూపొందే బయోపిక్ లో తాప్సీ మిథాలీ పాత్రను పోషిస్తుందట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
*  'దొరసాని' చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించాడు. సుమారు పాతికేళ్ల క్రితం ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'తాళి' చిత్రం రీమేక్ లో ఆనంద్ నటించనున్నట్టు సమాచారం.
*  బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో రానున్న భారీ చిత్రం షూటింగును వచ్చే నెల 9న హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించారు. మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

More Telugu News