పోలీసులపై దాడిచేసిన వారి మీదే చర్యలు ఉంటాయన్న ఎస్పీ
ధర్మవరం ఘటనలో జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారంటూ జనసేన నేతలు గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావుకు ఫిర్యాదు చేశారు. జనసేన నేతలు శ్రీనివాస్ యాదవ్, జియావుర్ రెహమాన్ ఎస్పీని కలిసి పరిస్థితిని వివరించారు. ఘటనపై వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. ఎస్పీ మాట్లాడుతూ, ధర్మవరం ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు. పోలీసులపై దాడిచేసిన వారి మీదే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.