నిన్న ఎయిర్ టెల్, వొడాఫోన్... నేడు జియో!

- పెరగనున్న జియో చార్జీలు
- యూజర్లపై భారం పడనివ్వబోమన్న జియో
- ఇప్పటికే చార్జీల పెంపుపై ప్రకటన చేసిన ఎయిర్ టెల్, వొడాఫోన్
ఇప్పుడు వాటి బాటలోనే జియో కూడా నడవాలని నిర్ణయించుకుంది. తాము కూడా చార్జీలు పెంచుతున్నట్టు వెల్లడించింది. అయితే యూజర్లపై పెద్దగా భారం పడని విధంగా తమ నూతన చార్జీలు ఉంటాయని పేర్కొంది. ఉచిత కాల్స్ తో టెలికాం రంగాన్ని కుదిపేసిన జియో ఇటీవలే ఐయూసీ చార్జీలు విధించి నష్టాల నుంచి స్వల్ప ఊరట పొందింది.
కాగా, ఆయా కంపెనీలు చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించినా, ఎంత మేర అన్నది ఇంకా ఖరారు కాలేదు. డిసెంబరు నుంచి కొత్త చార్జీలను అమలు చేసేందుకు ఈ దిగ్గజ టెలికాం ఆపరేటర్లు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.