ఇప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడి మార్పు అవసరం లేదు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

- ఈ పదవి కోసం రెడ్డి వర్గానికి చెందిన పది మంది పోటీ
- మార్పు అనివార్యమైతే భట్టి, శ్రీధర్ బాబు నాకు మద్దతు ఇవ్వాలి
- 2023లో మా ప్రభుత్వం రావడం ఖాయం
అయితే, ఇప్పట్లో పీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగించాలని కోరారు. పీసీసీ అధ్యక్షుడి మార్పు అనివార్యమైతే మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా పనిచేస్తే 2023లో తమ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.