Lok Sabha: తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చేస్తున్న కృషికి ధన్యవాదాలు: కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా

  • లోక్ సభలో తెలంగాణ ఎంపీ రంజిత్ రెడ్డి సూచనపై మంత్రి స్పందన
  • దేశ వ్యాప్తంగా రైతులకు పెట్టుబడి రాయితీని తొలిసారిగా కేంద్రం అమలు చేస్తోందన్న రూపాలా
  • తెలంగాణలో ఎకరాకు రూ.10 వేలు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. రైతులకు పెట్టుబడి రాయితీ కింద ఎకరాకు రూ.10వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు లోక్ సభలో రైతుల ఆదాయంలో వృద్ధి అన్న అంశంపై రంజిత్ రెడ్డి  మాట్లాడుతూ.. తమ మాదిరే దేశవ్యాప్తంగా రైతులందరికీ ఎకరాకు రూ.10వేల రాయితీ అందివ్వాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం తన వంతుగా ఐదు ఎకరాలకు రూ.6వేలు మాత్రమే ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఐదు ఎకరాలు ఉన్న ఒక రైతుకు యాబైవేల రూపాయలు అందుతున్నాయని రంజిత్ వెల్లడించారు.

దీనిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా స్పందించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం పలు పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. రైతులకు ఎకరాకు పదివేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రైతులకు పెట్టుబడి రాయితీని కేంద్రం తొలిసారిగా దేశ వ్యాప్తంగా అమలు చేస్తోందని తెలిపారు. తాము అందిస్తున్న ఆరువేల రూపాయల సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు.

More Telugu News