Teju: 'సోలో బ్రతుకే సో బెటర్' రిలీజ్ డేట్ ఖరారైపోయినట్టే

  • తేజు తాజా చిత్రంగా రానున్న 'ప్రతిరోజూ పండగే'
  • తదుపరి సినిమాగా 'సోలో బ్రతుకే సో బెటర్'
  • మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు

సాయిధరమ్ తేజ్ తాజా చిత్రంగా 'ప్రతిరోజూ పండగే' నిర్మితమైంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ వచ్చేనెల 20వ తేదీన విడుదల కానుంది. తేజు తదుపరి ప్రాజెక్టుగా 'సోలో బ్రతుకే సో బెటర్' రూపొందుతోంది. భోగవిల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా 'సుబ్బు' దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

మే 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా చెబుతున్నారు. మార్చి .. ఏప్రిల్ మాసాల్లో అంతా పరీక్షల హడావిడిలో వుంటారు. అందువలన మే 1వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారట. ఆ రోజున సెలవు కూడా కలిసొస్తుండటంతో, అదే రోజున విడుదల తేదీ ఖరారైపోవచ్చని అంటున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాలో, తేజు సరసన నాయికగా నభా నటేశ్ కనిపించనుంది.

More Telugu News