Venkaiah Naidu: మార్షల్స్ కొత్త డ్రెస్ కోడ్ పై తీవ్ర విమర్శలు.. వివరణ ఇచ్చిన వెంకయ్య నాయుడు

  • మాజీ సైనికాధికారులు సహా పలువురు అభ్యంతరాలు 
  • రాజ్యసభలో విపక్ష సభ్యుల ఆందోళన 
  • డ్రెస్ కోడ్ మార్పు నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తామన్న వెంకయ్య నాయుడు

రాజ్యసభ మార్షల్స్  కొత్త డ్రెస్ కోడ్ తో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై  మాజీ సైనికాధికారులు సహా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 'మిలిటరీ యునిఫాంను మిలిటరీయేతర వ్యక్తులు ధరించడం చట్టవిరుద్ధమని, అంతేగాక భద్రత రీత్యా ప్రమాదకరమని మాజీ సైన్యాధిపతి జనరల్  వీపీ మాలిక్ అన్నారు. దీనిపై రాజ్యసభ మరోసారి ఆలోచించి, చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని తెలిపారు. డ్రెస్ కోడ్ విషయంపై రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు.

దీంతో కొత్త డ్రెస్ కోడ్ పై రాజ్యసభ ఛైర్మన్  వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. డ్రెస్ కోడ్ మార్పు నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తామన్నారు. ఈ వస్త్రధారణపై అనేక సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సెక్రటేరియట్ ఈ కొత్త డ్రెస్ కోడ్ తీసుకొచ్చిందని చెప్పారు. అయినప్పటికీ దీనిపై మరోసారి ఆలోచించాలని చెప్పానని తెలిపారు.

  

More Telugu News