Sandeep Madhav: 'జార్జిరెడ్డి' నుంచి లిరికల్ వీడియో సాంగ్

  • సందీప్ మాధవ్ హీరోగా 'జార్జి రెడ్డి'
  • దర్శకుడిగా జీవన్ రెడ్డి 
  •  త్వరలో ప్రేక్షకుల ముందుకు

విద్యార్ధి నాయకుడిగా .. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కోసం చేసే పోరాటంలో ప్రాణాలను అర్పించిన అమరుడిగా 'జార్జిరెడ్డి' ఆ తరువాత తరాల విద్యార్థుల మనసుల్లోనూ నిలిచిపోయాడు. ఆయన జీవితచరిత్రను జీవన్ రెడ్డి తెరకెక్కించాడు. సందీప్ మాధవ్ ప్రధాన పాత్రధారిగా నిర్మితమైన ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను వదిలారు.

'అడుగడుగు .. మా ప్రతి అడుగు .. నీ వెనకాలే మా పరుగు .. అడుగడుగు మా మది నడుగు .." అంటూ ఈ పాట సాగుతోంది. సురేశ్ బొబ్బిలి సంగీతం .. రేవంత్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. యూనివర్సిటీ నేపథ్యంలో సాగే సంఘటనలపై కట్ చేసిన ఈ లిరికల్ వీడియో సాంగ్, స్టూడెంట్స్ ను టచ్ చేసే మాదిరిగా వుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది.

More Telugu News