Mamata Banerjee: అసదుద్దీన్ ఒవైసీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు

  • ఓ ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ
  • ఏఐఎంఐఎం అతివాద పార్టీ
  • ఇటువంటి శక్తులను నమ్మకూడదు
  • హిందూ అతివాద శక్తుల పట్ల కూడా ఓటర్లు జాగ్రత్తగా ఉండాలి

ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బిహార్ లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోన్న ఏఐఎంఐఎం పార్టీ సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తోందని, ఇటువంటి శక్తులను నమ్మకూడదని మైనార్టీలను కోరారు. ఆ పార్టీని అతివాద పార్టీగా ఆమె అభివర్ణించారు.

అలాగే, హిందూ అతివాద శక్తుల పట్ల కూడా ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. కాగా, 2011 నుంచి పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ కొనసాగుతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రయత్నాలు జరుపుతుండడంతో టీఎంసీ కూడా ఇప్పటి నుంచే తమ బలాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించిన విషయం తెలిసిందే.

More Telugu News