వైసీపీ ఎన్నికల ప్రచారం పాటలు.. డ్యాన్స్‌లతో ఇరగదీసిన తహసీల్దార్

- శ్రీకాకుళం జిల్లా భామిని మండలంలో ఘటన
- వైసీపీ కార్యకర్తల వనభోజనాలు
- వైరల్ అవుతున్న తహసీల్దార్ డ్యాన్స్ వీడియో
ఈ కార్యక్రమానికి భామిని తహసీల్దార్ ఎస్.నర్సింహమూర్తి, ఇతర రెవెన్యూ సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ వైసీపీ పాటలు ప్లే చేశారు. ఈ పాటలకు తహసీల్దార్ ఉత్సాహంగా స్టెప్పులేశారు. కార్యకర్తలతో కలిసి మైమరిచిపోయి డ్యాన్స్ చేస్తున్న తహసీల్దార్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.