సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

19-11-2019 Tue 07:30
  • భారీ ఆఫర్ ను తిరస్కరించిన సాయిపల్లవి
  • ప్రభాస్ కు కథ చెప్పిన 'కేజీఎఫ్' దర్శకుడు 
  • సూర్య సరసన మరోసారి అనుష్క

*  కథానాయిక సాయిపల్లవి తనకు నచ్చితేనే ఏ పనైనా చేస్తుంది, డబ్బు కోసం మనసుకు నచ్చనిది ఏమాత్రం చేయదు. అలా తనకు నచ్చని ఎన్నో సినిమాలను ఆమె తిరస్కరించింది. ఈ క్రమంలో తాజాగా ఓ పెద్ద వస్త్ర కంపెనీ నుంచి వచ్చిన ఆఫర్ ను కూడా ఆమె రిజక్ట్ చేసింది. ఏడాది పాటు బ్రాండ్ అంబాసడార్ గా వుంటే కనుక కోటి రూపాయలు ఇస్తామన్నప్పటికీ, ఆమెకు నచ్చక తిరస్కరించిందట.
*  ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో 'జాన్' చిత్రాన్ని చేస్తున్న ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకు ఓకే చేయలేదు. ఈ క్రమంలో 'కేజీఎఫ్' ఫేం ప్రశాంత్ నీల్ తాజాగా ప్రభాస్ ను కలసి ఓ కథ వినిపించాడని, ప్రభాస్ కు అది నచ్చిందని అంటున్నారు.
*  తమిళ నటుడు సూర్య హీరోగా గౌతం మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ జరుగుతోంది. ఇందులో కథానాయికగా అనుష్కను తీసుకుంటున్నట్టు సమాచారం. గతంలో వీరిద్దరూ 'సింగం' సీరీస్ లో నటించిన సంగతి విదితమే.