మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ

Tue, Nov 19, 2019, 07:12 AM
  • పది లక్షల రూపాయలు చోరీ
  • సంక్షేమ కార్యక్రమాల కోసం దాచి ఉంచినట్టు వెల్లడి
  • కార్యాలయంలో పనిచేసే వారిపైనే అనుమానం
ఏపీలోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. సంక్షేమ కార్యక్రమాల కోసం దాచి ఉంచిన 10 లక్షల రూపాయల మొత్తం చోరీకి గురైంది. ఈ మేరకు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కార్యాలయంలో పనిచేసే వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వైసీపీ నేత జూపూడి జాన్సన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరేశ్ కుమార్ తెలిపారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement