Shaheen-1: షహీన్-1 క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్

  • 650 కిమీ పరిధిలో లక్ష్యాలు ఛేదించగల షహీన్-1
  • అన్ని రకాల వార్ హెడ్లకు ఉపయుక్తం
  • ఇటీవలే అగ్ని-2 నైట్ వెర్షన్ మిసైల్ పరీక్షించిన భారత్

ఇటీవల కాలంలో పెద్దగా క్షిపణి పరీక్షలు నిర్వహించని పాకిస్థాన్ తాజాగా షహీన్-1 క్షిపణి పరీక్ష చేపట్టింది. భూతలం నుంచి భూతలంపైకి ప్రయోగించగల ఈ క్షిపణి రేంజ్ 650 కిలోమీటర్లు. దీని ద్వారా అన్ని రకాల వార్ హెడ్లు ప్రయోగించే వీలుంది. ఆర్మీ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ యుద్ధ సన్నద్ధత విన్యాసాల్లో భాగంగా షహీన్-1 ప్రయోగం చేపట్టినట్టు పాక్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ రాత్రిపూట కూడా ప్రయోగించగల అగ్ని-2 మిసైల్ ను పరీక్షించిన కొన్నిరోజులకే పాక్ షహీన్-1 ను పరీక్షించడం గమనార్హం.

More Telugu News