priminster Naredhra Modi appreciation NCP-BJD: పార్లమెంటులో ఎన్సీపీ, బీజేడీ నేతల క్రమశిక్షణ అమోఘం: ప్రధాని మోదీ ప్రశంసలు

  • ఆ రెండు పార్టీల నుంచి మనమందరం నేర్చుకోవాలి
  • వెల్ లోకి ప్రవేశించకుండా ఆ పార్టీల నేతలు సొంత క్రమశిక్షణ పాటించారు
  • ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మేము కూడా వెల్ లోకి దూసుకెళ్లాము

రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ), బీజేడీ (బిజు జనతాదళ్) పార్టీలను ప్రశంసించారు. ఆ పార్టీలు ప్రజల ఆదరణను చూరగొనటమేకాక, వారి హృదయాలను కూడా గెలుచుకున్నాయని చెప్పారు. ఆ రెండు పార్టీల నేతలనుంచి ఇతర పార్టీల నేతలు ఎంతో నేర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందులో తనకు మినహాయింపు లేదని .. తాను కూడా ఆ పార్టీ నేతల నుంచి నేర్చుకోవాల్సి ఉందన్నారు.

‘ఎన్సీపీ, బీజేడీ నేతలు ఒక్కసారి కూడా వెల్ లోకి ప్రవేశించలేదు. ఆ పార్టీలు సొంతంగా క్రమశిక్షణ ఏర్పరుచుకుని పాటించాయి. ఈ రెండు పార్టీల నాయకులు ఒక్కరు కూడా నియమాలను ఉల్లంఘించలేదు. మా పార్టీ సభ్యులతో సహా, మిగతా పార్టీల సభ్యులు వారి నుంచి ఈ క్రమశిక్షణను నేర్చుకోవాల్సి ఉంది. వెల్ లోకి ప్రవేశించకుండానే ఆ రెండు పార్టీలు ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మేము కూడా వెల్ లోకి దూసుకెళ్లాము. ఈ విషయంలో ఈ రెండు పార్టీల క్రమశిక్షణ ప్రశంసనీయం. దీనిపై ఎప్పుడో ఒకప్పుడు చర్చ జరగాల్సి ఉంది. రాజ్యసభ 250వ సమావేశాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను’ అని అన్నారు.

More Telugu News