108: బాబు పాలనలో ఆ కూత బాగానే వినబడింది.. జగన్ పాలనలోనే మూగబోయింది!: నారా లోకేశ్ సెటైర్

  • ‘108’ లు లేవంటూ నాడు జగన్ మొసలికన్నీరు కార్చారు
  • కురుపాంలో ‘108’ ఆపేశారు
  • రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోమారు విమర్శలు చేశారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక బహిరంగ సభలో మాట్లాడిన విషయమై సెటైర్లు విసిరారు. ‘కుయ్, ‘కుయ్, కుయ్’ అనే 108 అంబులెన్స్ శబ్దం చంద్రబాబునాయుడు హయాంలో వినబడటం లేదంటూ నాడు జగన్ మొసలికన్నీరు కార్చబోయారని, ఈలోపే, ఆ బహిరంగ సభకు హాజరుకావాల్సిన వైసీపీ కార్యకర్త గాయపడితే, ఆ సభ జరుగుతున్న దారి నుంచే ‘108 వెళ్లడంతో సొంత కార్యకర్తల ముందే జగన్ పరువుపోగొట్టుకున్నారని విమర్శించారు.

చంద్రబాబు హయాంలో ‘108’ కూత బాగానే వినబడింది కానీ, జగన్ పాలనలోనే ఆ కూత మూగబోయిందని అన్నారు. కురుపాం నియోజకవర్గంలో ‘108’ ఆపేశారంటే గిరిజనులపై జగన్ కి ఎంత ప్రేమ ఉందో అర్ధమవుతోందని, కొన్ని గిరిజన ప్రాంతాల్లోకి అంబులెన్స్ వెళ్లడం కష్టం కావడంతో టూ వీలర్ అంబులెన్స్ తీసుకొచ్చింది అప్పటి టీడీపీ ప్రభుత్వమని గుర్తుచేశారు.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం  ఏకంగా ఉన్న 108 వాహనాలను కూడా నిలిపివేసిందని  ఈ సమస్య కేవలం కురుపాంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని విమర్శించారు.

More Telugu News