Rajyasabha: రాజ్యసభ 250వ సమావేశం..ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది తగిన సమయం: ఛైర్మన్ వెంకయ్యనాయుడు

  • స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో భారత్ అనేక సమస్యలు ఎదుర్కొంది 
  • మనం చేసిన పనులను గుర్తుచేసుకుని వెన్ను తట్టుకునే సమయమిది
  • ప్రత్యేక చర్చలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు

ప్రజాస్వామ్యం గొప్పదనాన్ని చాటిచెప్పే అనేక కీలక ఘట్టాలకు వేదికగా నిలిచిన రాజ్యసభ ఈ రోజు ఓ ప్రత్యేకత సంతరించుకుంది. రాజ్యసభ 250వ సమావేశం ఈరోజు జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక చర్చలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ, ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది తగిన సమయమని, స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో భారత్ అనేక సమస్యలు ఎదుర్కొందని గుర్తుచేశారు.

మనం చేసిన పనులను గుర్తుచేసుకుని వెన్న తట్టుకునే సమయమిదని,1952లో రాజ్యసభ సమావేశమైన నాటి నుంచి ఎన్నో చట్టాలు చేసిందని అన్నారు. లోక్ సభ ఆమోదించిన బిల్లులకు రాజ్యసభ అడ్డంకిగా నిలవకూడదని సూచించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మరింత మెరుగ్గా పని చేసేందుకు ఆయన సూచనలు చేశారు.

కాగా, 1952 మే 13న రాజ్యసభ తొలి సమావేశం జరిగింది. రాజ్యసభ ఇప్పటి వరకు 5,466 పనిదినాలు పూర్తి చేసుకోగా, 3,817 బిల్లులను ఆమోదించింది. 1981 అక్టోబర్ 17న రాజ్యసభ సుదీర్ఘ సమావేశం జరిగింది.

More Telugu News