Nani: 'వి' కోసం నాని - సుధీర్ బాబు మధ్య భారీ ఫైట్

  • ఇంద్రగంటి మోహనకృష్ణ నుంచి 'వి'
  • నెగెటివ్ షేడ్స్ లో నాని పాత్ర 
  •  ఉగాదికి ప్రేక్షకుల ముందుకు 

విభిన్నమైన కథాంశాలను తెరకెక్కించే దర్శకులలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరుగా కనిపిస్తారు. ఆయన దర్శకత్వంలో 'వి' సినిమా రూపొందుతోంది. నాని - సుధీర్ బాబు ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా, చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల ముంబైలో ఒక భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో నాని - సుధీర్ బాబు మధ్య భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరించినట్టు సమాచారం.

ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నాని .. పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్ బాబు కనిపించనున్నారని చెబుతున్నారు. నివేద థామస్ .. అదితీరావు కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను, 'ఉగాది' కానుకగా మార్చి 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చిన సంగతి తెలిసిందే.

More Telugu News