Lok Sabha: తెలుగు భాషను పటిష్ఠం చేసే క్రమంలో మైసూరులోని సంస్థను నెల్లూరుకు మార్చడం జరిగింది!: కేంద్ర మంత్రి పోఖ్రియాల్

  • ప్రాంతీయ భాషలను పటిష్ఠం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది
  • నెల్లూరులో ప్రారంభించిన సంస్థ నవంబరు 13 నుంచి పనిచేస్తోంది
  • తెలుగు భాషపై చర్చలు, సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నారు

ప్రాంతీయ భాషల పరిరక్షణపై లోక్ సభలో ఏపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నకు కేంద్రమంత్రి పోఖ్రియాల్ సమాధానమిస్తూ, తెలుగు భాష పరిరక్షణకు సంబంధించిన పలు విషయాలపై వివరణ ఇచ్చారు. మైసూరులోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (సీఐఐఎల్) అధీనంలో ఉన్న తెలుగు క్లాసికల్ అభివృద్ధి సంస్థను నెల్లూరుకు మార్చిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రాంతీయ భాషలను పటిష్ఠం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని, ఇందుకోసం మైసూరులోని సంస్థను నెల్లూరుకు మార్చారని పోఖ్రియాల్ తెలిపారు. ఈ సంస్థ నవంబరు 13 నుంచి పనిచేయడం ప్రారంభించిందని వివరించారు. తెలుగు భాషపై ఇందులో చర్చలు, నిర్ణయాలు ఉంటాయని, అలాగే, సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.

More Telugu News