Kesineni Nani: ప్రాంతీయ భాషల పరిరక్షణపై లోక్ సభలో ప్రశ్నించిన కేశినేని నాని

  • ప్రాంతీయ భాషలను రక్షించాల్సిన అవసరం ఉంది
  • సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది
  • ఏపీ సర్కారు ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేసింది

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరిచేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లోక్ సభలో కేశినేని నాని మాట్లాడారు. ప్రశ్నోత్తరాలు కొనసాగుతోన్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ... ప్రాంతీయ భాషల పరిరక్షణకు కేంద్రం ఏమేం చర్యలు తీసుకుంటోందో వివరించాలని ఆయన ప్రశ్నించారు.

ప్రాంతీయ భాషలను రక్షించాల్సిన అవసరం ఉందని, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఏపీ సర్కారు ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేసిందని కేశినేని నాని అన్నారు. దేశంలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని ఆయన అన్నారు.

More Telugu News