Bangladesh: బంగ్లాదేశ్ లో రూ.220కి చేరిన కిలో ఉల్లి ధర

  • భారత్ నుంచి బంగ్లాకు ఉల్లి దిగుమతి బంద్
  • టర్కీ, ఈజిప్ట్, చైనా నుంచి బంగ్లా ఉల్లి దిగుమతి
  • ధరలు తగ్గించేందుకు చర్యలు 

భారత్ లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ నుంచి దిగుమతి ఆగిపోవడంతో బంగ్లాదేశ్‌లో కిలో ఉల్లిపాయల ధర రూ.220కు చేరింది. దీంతో ఆ దేశ ప్రభుత్వం విమానాల ద్వారా టర్కీ, ఈజిప్ట్, చైనా నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటూ ఉల్లి ధరలు తగ్గించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

పలు ప్రాంతాల్లో ఉల్లి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి కిలో ఉల్లి రూ.38కి అందించే ప్రయత్నాలు చేస్తోంది. ఉల్లి ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో తన ఇంట్లో కూరల్లో ఉల్లిని వాడద్దంటూ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్‌ హసినా నిర్ణయం తీసుకున్నారు. కాగా, భారత్ లోని పలు ప్రాంతాల్లో ఉల్లి కిలో రూ.70కి చేరిన విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో ఈ పరిస్థితి వచ్చింది.

More Telugu News