Shiv Sena: బీజేపీపై మరోసారి విమర్శలు గుప్పించిన శివసేన

  • ఛత్రపతి శివాజీ ఏ కులానికో, రాజకీయ పార్టీకో చెందినవాడు కాదు
  • మహారాష్ట్రలోని 11 కోట్ల మంది ప్రజలకు చెందినవాడు 
  • సతారా ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఉదయన్ రాజె బోస్లే ఓడిపోయారు
  • అయినప్పటికీ బీజేపీ.. శివాజీ ఆశీస్సులు తమకే ఉన్నాయంటోంది

బీజేపీపై శివసేన పార్టీ మరోసారి విమర్శలు గుప్పించింది. ఛత్రపతి శివాజీ ఏ కులానికో, రాజకీయ పార్టీకో చెందినవాడు కాదని, ఆయన మహారాష్ట్రలోని 11 కోట్ల మంది ప్రజలకు చెందినవాడని పేర్కొంది. 'సతారా లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఉదయన్ రాజె బోస్లే ఓడిపోయారు. అయినప్పటికీ శివాజీ మహారాజ్ ఆశీస్సులు తమకే ఉన్నాయని బీజేపీ చెప్పుకుంటోంది' అని శివసేన నేత సంజయ్ రౌత్ తమ పార్టీ పత్రిక సామ్నాలో ఓ కథనం రాసుకొచ్చారు. కాగా, బోస్లే ఎన్సీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి, ఉప ఎన్నికల్లో ఓడిపోయారు.

'అహంకారాన్ని, మోసపూరిత ధోరణిని ఉపేక్షించొద్దని శివాజీ మహారాజ్ నేర్పారు. శివాజీ మహారాజ్ పేరు చెప్పుకొని, గెలిచి ప్రమాణ స్వీకారం చేసి, ఆ తర్వాత తమ హామీల అమలులో మాట నిలుపుకోలేకపోతే, అలాగే రాష్ట్రాన్ని పరిపాలించేవాళ్లం తామే అని భావిస్తోంటే ఈ తీరు అంతా వారి పతనానికి సూచనలుగా నిలుస్తాయి' అని బీజేపీని ఉద్దేశిస్తూ సంజయ్ రౌత్ విమర్శించారు.  

'గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నర్మదా జిల్లాలో నరేంద్ర మోదీ... సర్దార్ పటేల్ మెమొరియల్ కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రధాని అయ్యారు. ప్రధానమంత్రి పదవీ కాలం ముగుస్తుందన్న సమయంలో సర్దార్ పటేల్ మెమొరియల్ కు సంబంధించిన పనులను పూర్తి చేశారు' అని సంజయ్ రౌత్ సామ్నాలో పేర్కొన్నారు.

More Telugu News