Haryana: అక్కడ అమాత్యులంతా అధిక సంపన్నులే : హరియాణా మంత్రివర్గం ముఖచిత్రం

  • రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన బీజేపీ
  • మొత్తం 12 మందికి మంత్రులుగా అవకాశం
  • మంత్రులందరూ కోటీశ్వరులే

ఉత్తర భారత భూభాగంలోని హరియాణాలో కొలువుదీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అమాత్యపదవులు స్వీకరించిన వారంతా కోటీశ్వరులే కావడం విశేషం. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలో మొత్తం 12 మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. వీరిలో ఒకరు మహిళ ఉన్నారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కోటీశ్వరులే. గత ప్రభుత్వంలో 70 శాతం మంది మాత్రమే కోటీశ్వరులు ఉండగా, ఈసారి వందశాతం ధనవంతులే. వీరి సగటు ఆస్తుల విలువ రూ.17.41 కోట్లు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి కూడా కోట్లకు అధిపతే అయినా ఆయన ఆస్తుల విలువ తెలియరాలేదు.

మంత్రుల్లో వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి జైప్రకాష్ దలాల్ అత్యంత కోటీశ్వరుడు. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.76 కోట్లు. ఆయన తర్వాత స్థానంలో ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ రూ.74 కోట్లు. ఇక, మంత్రుల్లో ముగ్గురు ఇంటర్ వరకు చదవగా, మిగిలిన వారు డిగ్రీ పూర్తి చేసినట్లు చెప్పారు.

More Telugu News