Gujarath: కత్తి పట్టుకుని డ్యాన్స్ చేసిన స్మృతీ ఇరానీ... వీడియో ఇదిగో!

  • భావ్ నగర్ లో సాంస్కృతిక కార్యక్రమం
  • కత్తులు తిప్పుతూ నృత్యం చేసిన స్మృతి
  • సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్

గుజరాత్ సంప్రదాయ నృత్యమైన 'తల్వార్ రాస్'ను తనదైన శైలిలో ప్రదర్శించిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కాసేపు సందడి చేశారు. భావ్ నగర్‌ లో స్వామి నారాయణ్ గురుకుల్ ఏర్పాటు చేసిన ఓ సాంస్కృతిక కార్యక్రమం సందర్భంగా, స్టేజ్ పైకి ఎక్కన ఆమె, రెండు చేతులతో కత్తులు పట్టుకుని, డ్యాన్స్ చేశారు. తనతో పాటు 'తల్వార్ రాస్' ప్రదర్శిస్తున్న చిన్నారులను చూసిన ఆమె వారిని అనుకరిస్తూ నృత్యం చేయగా, ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కేంద్ర జౌళి, మహిళా శిశు సంక్షేమ మంత్రిగా పనిచేస్తున్న స్మతి ఇరానీ, ఈ కార్యక్రమంలో చాలాసేపు పాల్గొని, చిన్నారులతో గడిపారు. కాగా, గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో 'తల్వార్ రాస్'కు మంచి ఆదరణ ఉంది.

More Telugu News