Sri Lanka: ముస్లిం ఓటర్లు వెళుతున్న బస్సుపై కాల్పులు... శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు హింసాత్మకం!

  • ఓటు వేసేందుకు కాన్వాయ్ గా వెళ్లిన ముస్లింలు
  • కాల్పులు జరిపి, రాళ్లు విసిరిన వ్యక్తి
  • అధ్యక్ష ఎన్నికల్లో 80 శాతం పోలింగ్

శ్రీలంకలో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళుతున్న ముస్లిం ఓటర్ల బస్సుల కాన్వాయ్‌ పై గుర్తుతెలియని వ్యక్తి, కాల్పులకు తెగబడ్డాడు. ఆపై రాళ్లు విసిరాడు. దాదాపు 100 బస్సులున్న ఈ కాన్వాయ్‌ ని అడ్డుకునేందుకు రహదారిపై టైర్లు కాల్చి వేశారని అధికారులు వెల్లడించారు. కొలంబోకు సమీపంలో ఉన్న తాంతిరిమలే ప్రాంతంలో ఈ ఘటన జరిగిందన్నారు. ప్రాణనష్టం సంభవించలేదని చెప్పారు. కాగా, అధ్యక్ష ఎన్నికల్లో సుమారు 80 శాతం వరకూ పోలింగ్‌ నమోదైనట్లు సమాచారం. ఈ దఫా పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను పెంచడంతో పాటు, ఎన్నడూ లేనంత పెద్దగా బ్యాలెట్ పేపర్ ను తయారు చేయాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి.

More Telugu News