యనమలకు కొడాలి నాని క్షమాపణలు చెప్పాలి: టీడీపీ నేత బుద్ధా వెంకన్న

16-11-2019 Sat 20:47
  • బీసీలను అధికార వైసీపీ ప్రభుత్వం చులకన చేస్తోంది
  • బ్రోకర్లంటూ విమర్శిస్తూ బీసీల అత్మ గౌరవాన్ని ఆ పార్టీ నేతలు దెబ్బతీస్తున్నారు
  • బీసీలకు కూడా నాని క్షమాపణ చెప్పాలి
ఆంధ్రప్రదేశ్ లో బీసీలను అధికార వైసీపీ ప్రభుత్వం చులకన చేస్తోందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. బ్రోకర్లంటూ విమర్శిస్తూ బీసీల అత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యనమల రామకృష్ణుడును హీనమైన భాషతో తీవ్రంగా అవమానపరచిన మంత్రి కొడాలి నాని క్షమాపణలు చెప్పాలని బుద్ధా డిమాండ్ చేశారు. లేకుంటే.. జగనే యనమలను తిట్టించారని బీసీలు భావించాల్సి ఉంటుందని చెప్పారు. అంతేకాక,  బీసీలకు కూడా కొడాలి నాని క్షమాపణ చెప్పాలని అన్నారు.