Sand: ఇసుక వారోత్సవాలు జరిపి ఏం సాధిస్తారు?: కన్నా లక్ష్మీనారాయణ

  • ఇసుక కొరత ప్రభుత్వ సృష్టేనన్న కన్నా
  • ఇసుక కొరత వెనుక కుట్ర ఉందని వ్యాఖ్యలు
  • వైసీపీ నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని వెల్లడి

ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఇసుక అంశంలో వైసీపీ సర్కారుపై విమర్శలు చేశారు. ఇసుక అందుబాటులో లేకుండా చేయడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కన్నా, ఇసుక కొరత అనేది ప్రభుత్వం సృష్టించిందేనని మండిపడ్డారు. ఇసుక వారోత్సవాలు జరిపి ఏం సాధిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఐదు నెలలకే విసిగిపోయి వైసీపీ నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని కన్నా వెల్లడించారు.

తాజా పరిణామాలపై వ్యాఖ్యానిస్తూ, నేతలు రాజకీయ విమర్శలు మాత్రమే చేయాలని, వ్యక్తిగత దూషణలు సరికాదని హితవు పలికారు. నాయకుడు నోరు పారేసుకుంటే చులకన అవుతారని వ్యాఖ్యానించారు. ఇక, జాతీయ రాజకీయాలపై స్పందిస్తూ, రాఫెల్ అంశాన్ని రాహుల్ గాంధీ రాజకీయం చేయాలని చూశారని, ఆయన ప్రధానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News