Varshita: చిన్నారి వర్షిత హత్య కేసును ఛేదించిన పోలీసులు

  • నిందితుడు ఓ లారీ క్లీనర్
  • చాక్లెట్ ఆశ చూపించి చిన్నారిపై అత్యాచారం
  • నిందితుడు బాలనేరస్తుడిగా జైలు జీవితం గడిపాడన్న ఎస్పీ

ఇటీవల చిత్తూరు జిల్లాలో చిన్నారి వర్షిత హత్యాచారం కేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసును చిత్తూరు జిల్లా పోలీసులు ఛేదించారు. నిందితుడు అంగళ్లు మొలకవారిపల్లెకు చెందిన లారీ క్లీనర్ రఫీగా గుర్తించారు. చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి తన వెంట తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్టు గుర్తించారు. రఫీ తొలుత చిన్నారిపై అత్యాచారం జరిపి ఆపై హతమార్చాడని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, ఊహాచిత్రాల సాయంతో నిందితుడ్ని పట్టుకున్నట్టు తెలిపారు. నిందితుడు రఫీకి గతంలోనూ నేర చరిత్ర ఉందని, బాలనేరస్తుడిగా జైలు జీవితం గడిపాడని వెల్లడించారు. కాగా, నిందితుడ్ని చత్తీస్ గఢ్ లోని జగదల్ పూర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News