Virat Kohli: ధోనీ రికార్డును అధిగమించిన కోహ్లీ

  • బంగ్లాదేశ్ పై ఇన్నింగ్స్ 130 పరుగులతో గెలుపొందిన ఇండియా
  • కెప్టెన్ గా 10 ఇన్నింగ్స్ విజయాలను అందుకున్న కోహ్లీ
  • 9 ఇన్నింగ్స్ విజయాలతో రెండో స్థానంలో ధోనీ

ఇండోర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కోహ్లీ ఓ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టుల్లో అత్యధిక ఇన్నింగ్ విజయాలను అందుకున్న భారత కెప్టెన్ గా అవతరించాడు. మాజీ కెప్టెన్ ధోనీ 9 ఇన్నింగ్స్ విజయాలతో ఇప్పటి వరకు తొలి స్థానంలో ఉన్నాడు. తాజాగా 10 ఇన్నింగ్స్ విజయాలతో ధోనీని కోహ్లీ రెండో స్థానంలోకి నెట్టేశాడు. ఆ తర్వాతి స్థానంలో 8 విజయాలతో అజారుద్దీన్, 7 విజయాలతో గంగూలీ ఉన్నారు.

More Telugu News