జగన్ జైలుకు వెళ్తాడనే నమ్మకంతో ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు: దేవినేని ఉమ

- జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడు
- అయ్యప్ప మాలలో ఉన్నవారితో కూడా తిట్టిస్తున్నాడు
- జే-ట్యాక్స్ కట్టిన కంపెనీల కోసమే మద్యం పాలసీ
పదవులకు రాజీనామా చేసి వచ్చిన వారినే వైసీపీలో చేర్చుకుంటామని చెప్పిన జగన్... వల్లభనేని వంశీ వ్యవహారంపై ఏం సమాధానం చెబుతారని దేవినేని ఉమ ప్రశ్నించారు. జగన్ జైలుకు వెళ్తాడనే నమ్మకంతో ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారని... అందుకే తమ పార్టీ నేతలను జగన్ చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
సిమెంట్ కంపెనీల వద్ద రూ. 1000 కోట్ల ముడుపులు పుచ్చుకుని... రూ. 2,500 కోట్ల బేరసారాలు సాగిస్తున్నారని ఆరోపించారు. దీన్ని ప్రశ్నించినందుకు చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా ఉండకూడదనే కుట్రలు చేస్తున్నారని అన్నారు. జే-ట్యాక్స్ కట్టిన మద్యం కంపెనీల కోసమే మద్యం పాలసీని తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇసుక కొరత జగన్ సృష్టి కాదా? అని ప్రశ్నించారు.