Bapatla: బాపట్ల తీరంలో కనిపించిన ప్రపంచంలోనే అరుదైన నీటి పిల్లి.. నీటి కుక్క!

  • నీటి పిల్లి, నీటి కుక్క సంరక్షణకు నడుంబిగించిన అటవీ అధికారులు
  • రూ.5.80 కోట్లు కేటాయించాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు
  • మడ అడవులు, చిత్తడి నేలల సంరక్షణకు అధికారుల ప్రణాళికలు

గుంటూరు జిల్లా బాపట్ల సముద్ర తీరంలో ప్రపంచంలోనే అరుదైన నీటి పిల్లి, నీటి కుక్కలు కనిపించాయి. దీంతో ఇప్పుడు వీటి సంరక్షణకు అధికారులు చర్యలు ప్రారంభించారు. మడ అడవులను, చిత్తడి నేలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అభివృద్ధి కోసం రూ.5.80 కోట్లు కేటాయించాలని కోరుతూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలకు అటవీ అధికారులు ప్రతిపాదన పంపారు. బాపట్ల తీర ప్రాంతంలోని  సైబీరియన్, ఫ్లెమింగో, గూడబాతులు తదితర అరుదైన పక్షి జాతులు ఇప్పటికే సంచరిస్తున్నాయి.

ఇప్పుడు వీటితోపాటు అరుదైన జంతు జాతుల సంరక్షణపైనా దృష్టి సారించనున్నారు. తాజాగా, అటవీ ప్రాంతంలో ఉన్న నీటి పిల్లులు, నీటి కుక్కలను గుర్తించేందుకు అడవిలో కెమెరాలు ఏర్పాటు చేశారు. సముద్ర తీర ప్రాంతంలో తాటి, సరుగుడు చెట్లను పెంచడం ద్వారా చిత్తడి నేలను సంరక్షిస్తారు. తద్వారా చేపలు వృద్ధి చెందుతాయని, ఫలితంగా నీటి పిల్లి, కుక్కలకు ఆహారం సమృద్ధిగా లభిస్తుందని పేర్కొన్నారు. కాగా, నీటి పిల్లి రాత్రివేళ మాత్రమే ఆహారం కోసం సంచరిస్తుంది.

More Telugu News