Sai Pallavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నెట్ ఫ్లిక్స్ సీరీస్ లో సాయిపల్లవి 
  • బోయపాటి సినిమా అప్ డేట్
  • 'సూపర్ మచ్చి'లో కన్నడ బ్యూటీ 

   *  కథానాయిక సాయిపల్లవి కూడా డిజిటల్ ప్రపంచంలోకి వస్తోంది. నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఓ సీరీస్ లో నటించడానికి ఓకే చెప్పింది. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వం వహించే ఈ సీరీస్ లో ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషిస్తాడు.
*  బాలకృష్ణ, బోయపాటి కలయికలో రానున్న భారీ చిత్రం షూటింగును వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. రెగ్యులర్ షూటింగును జనవరి నుంచి నిర్వహిస్తారు. ఇక తాజా సమాచారం ప్రకారం, ఇందులో కీలక పాత్రకు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ను సంప్రదిస్తున్నారట. అలాగే ఓ హీరోయిన్ పాత్రకు కన్నడ నటి రచిత రామ్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.    
*  మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న 'సూపర్ మచ్చి' చిత్రంలో కన్నడ బ్యూటీ రచిత రామ్ కథానాయికగా నటించనుంది. పులి వాసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  

More Telugu News