పోలవరానికి నిధులు విడుదల చేయాలని కోరతాం: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

15-11-2019 Fri 21:21
  • ఈ నెల 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
  • వైసీపీ ఎంపీలకు ఏపీ సీఎం జగన్ దిశానిర్దేశం
  • తాడేపల్లిలో నిర్వహించిన వైసీపీ పార్లమెంటరీ సమావేశం

ఈ నెల 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇరవైరోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ ఎంపీలకు ఏపీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలో వైసీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది.

అనంతరం మీడియాతో ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలకు జగన్ సూచించినట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం గత సమావేశాల్లో ఏ విధంగా అయితే కేంద్రాన్ని ప్రశ్నించామో అదేవిధంగా ఈసారి ప్రశ్నిస్తామని అన్నారు.