dowry Rs.11 Lakhs: రూ.11 లక్షల కట్నం వద్దంటూ.. కేవలం రూ.11 మాత్రమే తీసుకున్న వరుడు!

  • రాజస్థాన్ లో సీఐఎస్ ఎఫ్ జవాన్ జితేందర్ ఆదర్శ చర్య
  • నా భార్య మెజిస్ట్రేట్ అయితే అదే పెద్ద కట్నం
  • మా అల్లుడు మంచోడంటూ మామ గోవింద్ సింగ్ అనందం

ఈ రోజుల్లో కట్నం ఇస్తానంటే తీసుకోని వరుడు ఎవడుంటాడు? అయితే, రాజస్థాన్ కు చెందిన సీఐఎస్ ఎఫ్ కానిస్టేబుల్ జితేందర్ మాత్రం ఏకంగా రూ.11 లక్షల కట్నాన్నే వద్దన్నాడు. కట్నం బదులుగా రూ.11లతో పాటు ఓ కొబ్బరికాయను బహుమతిగా తీసుకున్నాడు. జైపూర్ కు చెందిన జితేందర్ కు ఈ నెల 8న పెళ్లి జరిగింది.

పెళ్లి పందిట్లో పెళ్లికూతురు తండ్రి గోవింద్ సింగ్ కట్నం కింద రూ.11 లక్షల నగదును పళ్లెంలో పెట్టి వరుడికి ఇవ్వబోగా పెళ్లి కుమారుడు జితేందర్ వద్దంటూ.. కేవలం 11 రూపాయలను, ఓ కొబ్బరికాయను మాత్రమే కట్నంగా స్వీకరించాడు. దీంతో గోవింద్ సింగ్ మొదట అయోమయానికి గురైనప్పటికి.. తాను కట్నం ఎందుకు వద్దాంటున్నానో జితేందర్ వివరించడంతో ఆనందం వ్యక్తం చేశాడు.  తనకు కాబోయే భార్య న్యాయశాస్త్రంలో పీజీ చేశారని, అమె రాష్ట్ర జుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతోందన్నారు. అమె మెజిస్ట్రేట్ అయితే అదే పెద్ద కట్నం అని జితేందర్ చెప్పి అందరి మెప్పును పొందాడు.

More Telugu News