Sensex: లాభాల్లో వారాన్ని ముగించిన మార్కెట్లు.. దూసుకుపోయిన ఎయిర్ టెల్

  • 70 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 23 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • తొమ్మిదిన్నర శాతానికి పైగా లాభపడ్డ ఎయిర్ టెల్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. అంతవరకు భారీ లాభాల్లో ఉన్న మార్కెట్లు చివరి అరగంటలో బాగా కోల్పోయాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు పాల్పడటంతో ఒక్కసారిగా పతనమయ్యాయి. అయితే చివర్లో మళ్లీ కొంతమేర మార్కెట్లు పుంజుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో 40,357కి చేరుకుంది. నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 11,895 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (9.58%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (5.50%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (1.71%), సన్ ఫార్మా (1.45%), టాటా మోటార్స్ (1.02%).

టాప్ లూజర్స్:
హీరో మోటో కార్ప్ (-1.63%), మారుతి సుజుకి (-1.46%), వేదాంత లిమిటెడ్ (-1.46%), బజాజ్ ఆటో (-1.43%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.34%).

More Telugu News