రాహుల్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రేపట్నుంచి బీజేపీ నిరసన కార్యక్రమాలు

15-11-2019 Fri 14:21
  • రాఫెల్ డీల్ పై సీబీఐ విచారణ అవసరం లేదంటూ సుప్రీంకోర్టు తీర్పు
  • దేశాన్ని రాహుల్ తప్పుదోవ పట్టించారన్న బీజేపీ
  • ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం వెలుపల నిరసన చేపడుతున్నట్టు ప్రకటన

రాఫెల్ డీల్ వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించాల్సిన అవసరం లేదంటూ నిన్న సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాహుల్ కు వ్యతిరేకంగా రేపట్నుంచి దేశ వ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమాలను చేపట్టనుంది. యావత్ దేశాన్ని రాహుల్, కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టించిందని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా నిరసనలు చేపడతామని తెలిపారు.

మరోవైపు, ప్రధాని మోదీని ఉద్దేశించి 'కాపలాదారుడే దొంగ' అనే వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం దావాను నిన్న సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇకపై జాగ్రత్తగా మాట్లాడాలంటూ రాహుల్ ను హెచ్చరించింది.