Maharashtra: ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లను ఆహ్వానించొద్దు: సుప్రీంకోర్టులో పిటిషన్

  • కనీస ఉమ్మడి కార్యక్రమానికి మూడు పార్టీలు అంగీకారం
  • సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన హిందూ మహాసభ నేత ప్రమోద్ జోషి 
  • ఎన్నికల తర్వాత పొత్తు ప్రజలను మోసం చేయడంగా పరిగణించాలి

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం కనీస ఉమ్మడి కార్యక్రమానికి శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీల అధినేతలు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మూడు పార్టీల కలయికతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించవద్దని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల తర్వాత పార్టీల పొత్తు ప్రజలను మోసం చేయడంగా పరిగణించాలని భారత హిందూ మహాసభ నేత ప్రమోద్ జోషి ఈ పిటిషన్ వేశారు.  

కాగా, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఒప్పందం కుదుర్చుకున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న విషయం తెలిసిందే. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలకు తగినంత సంఖ్యా బలం ఉంటే వారు గవర్నర్‌ దగ్గరికి వెళ్లి, తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవలసిందిగా కోరవచ్చు. ఈ రోజు సాయంత్రం వారు గవర్నర్ వద్దకు వెళ్లనున్నట్లు తెలిసింది.

More Telugu News