Akash: గోవాలో 'రొమాంటిక్' సాంగ్ చిత్రీకరణ

  • మాఫియా నేపథ్యంలో సాగే ప్రేమకథ 
  •  కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ 
  • వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు 

ఆకాశ్ పూరి కథానాయకుడిగా 'రొమాంటిక్' చిత్రం రూపొందుతోంది. పూరి జగన్నాథ్ నిర్మాణంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా అనిల్ పాదూరి .. కథానాయికగా కేతిక శర్మ పరిచయమవుతున్నారు. పూరి కథాకథనాలను అందించిన ఈ సినిమా, కొన్ని రోజులుగా 'గోవా'లో షూటింగ్ జరుపుకుంటోంది.

నిన్నమొన్నటివరకూ అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం అక్కడ నాయకా నాయికల కాంబినేషన్లో ఒక రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుందని అంటున్నారు. మరో రెండు మూడు రోజుల పాటు ఈ పాటనే చిత్రీకరిస్తారట. మాఫియా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో, రమ్యకృష్ణ  కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News