GST: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు పెంపు!

  • ఈ నెల 30తో ముగియనున్న గడువు డిసెంబరు 31 వరకు పొడిగింపు
  • డిసెంబరు 31తో ముగియాల్సిన గడువు వచ్చే ఏడాది మార్చికి పెంపు
  • జీఎస్టీ ఫామ్‌లను మరింత సులభతరం చేసిన సీబీఐసీ

జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ గడువును పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2017-18, 2018-19 సంవత్సరాలకు గాను ఫామ్ జీఎస్‌టీఆర్-9 (వార్షిక రిటర్న్), ఫామ్ జీఎస్‌టీఆర్-9సి (సయోధ్య ప్రకటన) ఫైలింగ్ గడువును పొడిగించింది. 2017-18 జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు ఈ నెల 30తో ముగియనుండగా, దానిని ఈ డిసెంబరు 31 వరకు, డిసెంబరు 31తో ముగియనున్న 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ ఫైలింగ్ గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. ప్రభుత్వ తాజా ప్రకటనతో పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించినట్టు అయింది. వీటితోపాటు జీఎస్టీ ఫామ్‌లలోని కొన్ని ఫీల్డ్స్‌ను ఆప్షనల్ చేస్తూ మరింత సులభతరం చేసినట్టు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) తెలిపింది.

More Telugu News