ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

  • మొలుక్క తీర ప్రాంతంలో భూకంపం
  • రిక్టర్ స్కేలుపై 7.1గా తీవ్రత నమోదు
  • తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ఇండోనేషియాలో గత రాత్రి భారీ భూకంపం సంభవించింది. మొలుక్క సముద్ర తీరంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. టెర్నేట్ పట్టణానికి వాయవ్య దిశలో 139 కిలోమీటర్ల దూరంలో, 45 కిలోమీటర్ల  లోతున భూకంపం సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భూకంప తీవ్రత అధికంగా ఉండడంతో సునామీ హెచ్చరికలను జారీ చేసిన ప్రభుత్వం తీర ప్రాంతంలో నివసిస్తున్న వారిని ముందుజాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు.

More Telugu News