'రెడ్' షూటింగ్ మొదలెట్టేసిన రామ్

- కిషోర్ తిరుమల దర్శకుడిగా 'రెడ్'
- ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్
- వచ్చే వేసవి సెలవుల్లో విడుదల
స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ రెండు పాత్రల్లోనూ ఆయన డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. వచ్చే వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' హిట్ తరువాత రామ్ చేస్తున్న సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి.