RGV: 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' నుంచి ఆసక్తికరమైన పోస్టర్ విడుదల చేసిన వర్మ

  • బాలల దినోత్సవం సందర్భంగా పోస్టర్
  • దేవాన్ష్ ను కూడా వదలని వర్మ 
  • తాత, తండ్రితో దేవాన్ష్ ఆడుకుంటున్నట్లు పోస్టర్

బాలల దినోత్సవం సందర్భంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రంలోంచి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇటీవలే 'పప్పులాంటి అబ్బాయి' పాటను విడుదల చేసి అలజడి రేపిన వర్మ ఇప్పుడు ఈ పోస్టర్ తో మరో వివాదం రేపేలా ఉన్నారు. సినిమా టైటిల్ తోనే వేడి పుట్టించిన వర్మ...  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ ను కూడా వదలట్లేదు. ఈ రోజు ఆయన విడుదల చేసిన ఈ పోస్టర్ లో దేవాన్ష్ పాత్ర ఉంది.

చంద్రబాబు, నారా లోకేశ్ తో దేవాన్ష్ ఆడుకుంటున్నట్లు ఉన్న ఈ పోస్టర్ ను బాలల దినోత్సవం సందర్భంగా వర్మ విడుదల చేశారు. ఈ సినిమాలోని పలు పోస్టర్ లను ఇప్పటికే వర్మ విడుదల చేశారు. ఈ సినిమాకు ట్రైలర్‌ కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పలువురు నేతలను ఉద్దేశించి ఈ సినిమా ఉన్నట్లు వాటి ద్వారా తెలిసింది.

More Telugu News