Rana: 'యాక్షన్' సినిమా నుంచి రానా సాంగ్

  • విశాల్ హీరోగా రూపొందిన 'యాక్షన్'
  • తమిళ .. తెలుగు భాషల్లో విడుదల
  • సంగీత దర్శకుడిగా హిపాప్ తమిజా

తమిళనాట యాక్షన్ హీరోల జాబితాలో విశాల్ పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. యాక్షన్ సినిమాలే ఆయనకి ఎక్కువ క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఈ సారి ఆయన 'యాక్షన్' అనే టైటిల్ నే సెట్ చేసుకుని వస్తున్నాడు. సుందర్ .సి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం రానా ఒక పాట పాడాడు. కొంతసేపటి క్రితం ఆ పాటను వదిలారు. 'లైట్స్ .. కెమెరా .. .యాక్షన్ .. ' అంటూ ఈ సాంగ్ సాగుతోంది. హీరో యాక్షన్ సన్నివేశాలపై ఈ సాంగ్ ప్లే అవుతూ వుంటుందనే విషయం విజువల్స్ ను బట్టి అర్థమవుతోంది. ర్యాప్ తరహాలో సాగే ఈ పాటను రానా పాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే ఉద్దేశంతోనే విశాల్ పాడించాడు. హిపాప్ తమిజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, విశాల్ సరసన నాయికగా తమన్నా కనిపించనుంది.

More Telugu News