Shivsena: రాష్ట్రపతి పాలన విధింపు వెనుక ఒక అదృశ్య శక్తి ఉంది: శివసేన

  • ఆరెస్సెస్, బీజేపీ చేతుల్లో అధికారాన్ని ఉంచడానికే రాష్ట్రపతి పాలన
  • ఫడ్నవిస్ మొసలి కన్నీరు కారుస్తున్నారు
  • రాష్ట్రపతి పాలన విధించాలనే స్క్రిప్టును ఎప్పుడో రాశారు

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను విధించడంపై బీజేపీతో పాటు, ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీపై శివసేన మండిపడింది. సంఘ్ పరివార్, బీజేపీ చేతుల్లో అధికారాన్ని ఉంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని శివసేన అధికారిక పత్రిక సామ్నా ఆరోపించింది. రాష్ట్రపతి పాలన విధించాలనే నిర్ణయం వెనుక ఒక కనిపించని శక్తి ఉందని తెలిపింది. ఆ అదృశ్య శక్తే గవర్నర్ ను ఒప్పించేలా బీజేపీకి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు మార్గనిర్దేశం చేసిందని పేర్కొంది.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంతో తాను చాలా అప్ సెట్ అయ్యానని, ఇది దురదృష్టకరమంటూ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మొసలి కన్నీరు కారుస్తున్నారని సామ్నా విమర్శించింది. రాజకీయ అస్థిరత్వంతో మహారాష్ట్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుందని ఫడ్నవిస్ అన్నారని... ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలనే స్క్రిప్టును ఎప్పుడో రాసేశారని మండిపడింది.

More Telugu News