ఫ్యాన్స్ కి సర్ ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చేసిన బన్నీ

Thu, Nov 14, 2019, 10:26 AM
  • బన్నీ మూవీ నుంచి మూడో సాంగ్ టీజర్ 
  •  సందడి చేసిన బన్నీ పిల్లలు 
  •  పూర్తి పాట ఈ నెల 22వ తేదీన
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందుతోంది. చిత్రీకరణపరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా నుంచి వదిలిన రెండు పాటలకు యూత్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో 3వ సాంగ్ టీజర్ ను కొంతసేపటి క్రితం వదిలారు.  

ఈ రోజున 'చిల్డ్రన్స్ డే' కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, 'ఓమై గాడ్ డాడీ' అనే సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. బన్నీ ఇద్దరు పిల్లలకి సంబంధించిన వీడియోపై ఈ సాంగ్ బిట్ ను రన్ చేశారు. బన్నీ పిల్లలిద్దరూ ఈ సాంగ్ కి తమ వయసుకి తగిన స్థాయిలోనే అభినయించారు. బన్నీ తనయుడు రెండు స్టెప్పులు కూడా వేశాడు. బన్నీ ఫ్లెక్సీ దగ్గర వాళ్లు చేసిన సందడి ఆకట్టుకుంటోంది. పూర్తి పాటను ఈ నెల 22వ తేదీన వదలనున్నారు. జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement