'అంతఃపురం' తరువాత కృష్ణవంశీ చిత్రానికి ఇళయరాజా

Thu, Nov 14, 2019, 09:54 AM
  • కృష్ణవంశీ నుంచి 'రంగమార్తాండ'
  • మరాఠీ మూవీ 'నట సామ్రాట్'కి రీమేక్ 
  • సంగీత దర్శకుడిగా ఇళయరాజా  
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'అంతఃపురం' ఒకటి. సామాజిక సందేశాన్ని అందించిన చిత్రంగా ఈ సినిమాకి ప్రత్యేకమైన స్థానం వుంది. ఇళయరాజా అందించిన సంగీతం ఆ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. 20 యేళ్ల తరువాత మళ్లీ ఈ ఇద్దరూ ఒక సినిమాకి కలిసి పనిచేయనున్నారు .. ఆ సినిమాయే 'రంగమార్తాండ'.

మరాఠీలో 'నట సామ్రాట్' పేరుతో వచ్చిన సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాను 'రంగమార్తాండ' టైటిల్ తో కృష్ణవంశీ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఇళయరాజా అయితే పూర్తి న్యాయం జరుగుతుందని భావించిన కృష్ణవంశీ ఆయనను కలిశారు. కంటెంట్ ప్రాధాన్యతను బట్టి చాలా తక్కువ సినిమాలను మాత్రమే ఒప్పుకుంటున్న ఇళయరాజా, 'రంగమార్తాండ'కి సంగీతాన్ని అందించడానికి అంగీకరించడం విశేషం. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలను పోషించనున్న సంగతి తెలిసిందే.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement