East Godavari District: 15.6 అంగుళాల పొడవు, 22 అంగుళాల వెడల్పుతో జమ్నించిన ఆవు దూడ!

  • గుమ్మలూరులో జన్మించిన దూడ
  • భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు
  • చర్చించుకుంటున్న ప్రజలు

తూర్పు గోదావరి జిల్లా గుమ్మలూరులో జన్మించిన ఓ ఆవు దూడ ఇప్పుడు సంచలనం సృష్టిస్తూ, ఆంధ్రా రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. ఇక్కడి రైతు ముత్యాల వీరభద్రరావుకు చెందిన ఆవుకు అతిచిన్న పుంగనూరు దూడ జన్మించింది. దీని ఎత్తు 15.6 అంగుళాలు కాగా, పొడవు 22 అంగుళాలు మాత్రమే ఉంది. కేవలం 7.4 కిలోల బరువుతో ఇది జన్మించింది.

 ఇది అరుదైన విషయమంటూ, ఈ విషయాన్ని భారత్ బుక్ ఆఫ్ రికార్డు, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేస్తున్నట్లు భారత బుక్ ఆఫ్ రికార్డు చీఫ్ ఎడిటర్ అన్నపూర్ణ వెల్లడించారు. కార్తీక మాసంలో ఈ దూడ జన్మించడంతో దీనిని ఏ సంకేతంగా భావించాలో తెలియడం లేదని గ్రామస్థులు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఇప్పడు వైరల్ అవుతోంది. 

More Telugu News