Blue frog: బ్లూ ఫ్రాగ్ కంపెనీతో నాకు ఎటువంటి సంబంధం లేదు: నారా లోకేశ్

  • 'మన శాండ్' వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన బ్లూ ఫ్రాగ్ కంపెనీ
  • ఈ కంపెనీతో లోకేశ్ కు సంబంధముందని వదంతులు
  • ఈ వదంతులను ఖండించిన లోకేశ్

'మన శాండ్' అనే వెబ్ సైట్ ను హ్యాక్ చేసి ఇసుక సరఫరాను బ్లాక్ చేశారని అనుమానిస్తూ.. విశాఖపట్టణంలోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సంస్థతో టీడీపీ నేత నారా లోకేశ్ కు సంబంధాలు ఉన్నాయంటూ వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో లోకేశ్ స్పందించారు. ఈ సంస్థతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఈ సంస్థతో తనకు సంబంధం ఉందని వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై అసత్య ప్రచారానికి పాల్పడుతున్న వ్యక్తులపై చట్టపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. వైసీపీ  ప్రభుత్వ అసమర్థపాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆ పార్టీ నేతలు ఇలాంటి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

More Telugu News