టీడీపీ నేత దేవినేని అవినాష్ పార్టీ మారతారంటూ ప్రచారం?

Wed, Nov 13, 2019, 07:24 PM
  • కృష్ణా జిల్లా టీడీపీ నేత దేవినేని అవినాష్ 
  • టీడీపీలో అవినాష్ కు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటున్న అభిమానులు
  • పార్టీ మారాలని అవినాష్ పై ఒత్తిడి!
కృష్ణా జిల్లా టీడీపీ నేత దేవినేని అవినాష్ పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతోంది. విజయవాడలోని గుణదలలో తన అభిమానులతో అవినాష్ సమావేశం కావడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. అవినాష్ కు టీడీపీలో తగిన న్యాయం జరగడం లేదని, అతనికి ప్రాధాన్యం ఇవ్వకుండా నేతలు కుట్ర చేస్తున్నారని దేవినేని నెహ్రూ అభిమానులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీని వీడాలని అవినాష్ పై కార్యకర్తలు, ఆయన అభిమానులు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.  
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad