Mana Sand web site hack?: ‘మన శాండ్’ ఆన్ లైన్ వెబ్ సైట్ హ్యాక్ ? ..బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు

  • మన శాండ్ వెబ్ సైట్ సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేసిన బ్లూ ఫ్రాగ్
  • కొంతమంది ఉద్యోగాలు సర్వర్ హ్యాక్ చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు
  • ప్రభుత్వానికి వాటిల్లిన నష్టంపై అంచనాలు వేస్తున్న సీఐడీ

  విశాఖపట్టణంలోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సంస్థకు చెందిన కొంతమంది ఉద్యోగులు ప్రభుత్వం ప్రారంభించిన 'మన శాండ్' అనే వెబ్ సైట్ ను హ్యాక్ చేసి ఇసుక సరఫరాను బ్లాక్ చేశారని అనుమానిస్తూ.. పోలీసులు, సీఐడీ అధికారులు ఈ సోదాలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇసుక కొరత నేపథ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్న సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.

బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలోని కొంతమంది ఉద్యోగులు 'మన శాండ్' వెబ్ సర్వర్లను హ్యాక్ చేసి కోడ్ ద్వారా ఇసుక సరఫరాలను బ్లాక్ చేశారని పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఈ సోదాలు చేపట్టారని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీలో భాగంగా ‘మన శాండ్’ అన్న వెబ్ సైట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అన్ లైన్ మాధ్యమంగా అందరికీ ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకు సంబంధించి వెబ్ సైట్ సాఫ్ట్ వేర్ అభివృద్ధి కార్యకలాపాలను ఈ బ్లూ ఫ్రాంగ్ సంస్థకు అప్పగించింది.

More Telugu News