Chandrababu: చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: బొత్స

  • జగన్ పై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన బొత్స  
  • పెట్టుబడులు తిరిగి వెళ్లిపోతున్నాయని టీడీపీ దుష్ర్పచారం చేస్తోందన్న మంత్రి
  • తండ్రి ఆశయాలు నెరవేర్చడానికే సీఎం జగన్ అయ్యారు

సీఎం జగన్ పై  చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ రోజు బొత్స సచివాలయంలో మీడియాతో భేటీ అయ్యారు. చంద్రబాబు, లోకేష్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. జగన్ ను విమర్శిస్తూ చంద్రబాబు అన్నమాటలు సరికావని పేర్కొన్నారు.  రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెళ్లిపోతున్నాయని టీడీపీ దుష్ర్పచారం చేస్తోందన్నారు. 'జగన్ ఒక్కసారి సీఎం పదవి చేపట్టి మానేసే వ్యక్తి కాదు. తన తండ్రి ఆశయాలు నెరవేర్చడానికే సీఎం అయ్యారు. మరో 25 ఏళ్లు సీఎంగా ఉంటానని జగన్ అన్నారు. జగన్ పాలనలో దోపిడీకి అవకాశంలేదు' అని చెప్పారు.

 మా ప్రభుత్వం  పెట్టుబడులను స్వాగతిస్తుంది

స్టార్టప్ కంపెనీ ప్రారంభించాలని గత ప్రభుత్వంతో సింగపూర్ కంపెనీ ఒప్పందం చేసుకుందని,  స్విస్ చాలెంజ్ విధానాన్ని అప్పట్లో అందరూ వ్యతిరేకించారని మంత్రి గుర్తు చేశారు. తాజాగా ఈ కంపెనీ ప్రతినిధులు తమతో ఒప్పందం గురించి మాట్లాడారు కానీ, ఆదాయం ఎలా వస్తుందో చెప్పలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒప్పందాన్నిరద్దు చేయాలనుకుంటున్నట్లు వారు చెప్పారనీ, దానికి తాము ఓకే చెప్పామని బొత్స వివరించారు. అయితే ఈ ప్రాజెక్టులో కాకుండా మరో ప్రాజెక్టులో పెట్టుబడులు పెడతామని వారన్నారని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారిని ప్రభుత్వం ఆహ్వానిస్తుందని చెప్పారు. వారికి తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని అన్నారు.

More Telugu News